నీ నోటితో ప్రభుకి స్తుతి పలుకు

2 Aug

Home | A Miracle Every Day | Miracles | నీ నోటితో ప్రభుకి స్తుతి పలుకు

క్రొత్త వార ప్రారంభంలో స్తుతి మరియు ఆరాధన యొక్క ప్రాముఖ్యత గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను.నేను అన్ని వేళలో దేవునికి కృతఙతా స్తుతులు అర్పించడం నేర్చుకున్నాను..ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆయన మంచివాడు మరియు  మహిమకు అర్హుడు! దేవుణ్ణి స్తుతించడం కూడా ప్రోత్సహించబడటానికి ఒక అద్భుతమైన మార్గం. మార్పు మరియు అనిశ్చితి యొక్క ఈ సమయములో మనకు ఎంత అవసరం.

దేవుణ్ణి స్తుతించడం ఎంత మంచిది! తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మను కీర్తింపజేయడానికి నేను మొదటగా చేస్తున్నప్పుడు, అది నాకు ఎంత మేలు చేస్తుందో నేను గ్రహించాను. అవును, స్తుతి మరియు ఆరాధన మనల్ని భందకాలనుండి విడిపిస్తుంది.

దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది అనగా, “ సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.” యెషయా 61:3

హల్లెలూయా! అవును, ఈ అందమైన ఉల్లాస వస్త్రము అంతా ఆయన మహిమ కోసమే!

కీర్తనల నుండి ఈ వాక్యాలను నాతో ప్రకటించండి, హృదయపూర్వకంగా ప్రకటించండి!

  • యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి.(కీర్తనలు149:1)
  • యెహోవానుస్తుతించుడి. యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రముచేయుట ఒప్పిదము.(కీర్తనలు 147:1)
  • యెహోవానుస్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి.ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములనుబట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావమునుబట్టి ఆయనను స్తుతించుడి.(కీర్తనలు 150:1-2)
  • యెహోవానుస్తుతించుట మంచిది మహోన్నతుడా,నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది.(కీర్తనలు 92:1-3)

మన దేవుడు అద్భుతమైనవాడు కాదా?

ఈ రోజు, దేవుని గొప్ప స్తుతులను పాడటానికి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.

Do you want to receive this daily encouragement in your inbox? Sign up for A Miracle Every Day.

* indicates required
    *

Leave a Comment