దేవుని శాంతిని పొందుము

5 Aug

Home | A Miracle Every Day | Miracles | దేవుని శాంతిని పొందుము

యేసు చెప్పెను, “నా శాంతిని నీకిచ్చుచున్నాను. అది లోకమిచ్చేటటువంటిది కాదు. మీ హృదయమును కలవరపడనీయకుము,  భయపడకుము.”(యోహాను 14:27)

యేసే నీ సమాధానము. నీవొకప్పుడు దేవునికి శత్రువుగా ఉంటివి. నీ తలంపులు, క్రియలు, మాటల ద్వారా,అయితే యేసయ్య వచ్చి తండ్రిలో మనలను ఐక్కపరచెను.సమాధనపరచెను.

క్రీస్తుతో సమాధానపడడమనేది అద్భుతమైన అనుభవము. అది గొప్ప విడుదల. నీ పాపాలు క్షమించబడినవి, నీవిప్పుడు స్వతంత్రుడవు.

క్రీస్తు నా హృదయములోనీకి వచ్చినప్పుడు ఈ శాంతి నన్నెంతో ఆశ్చర్యపరచింది. నేను క్షమించబడి నాను. నేను విడుదల పొందినాను. నా కోరికలనన్నీ నన్ను విడిచిపోయినవి దవునికి మహిమ!

ఈ శాంతి నీకు ఒక దినము కొరకియ్యబడలేదు. ఈ శాంతిలో నీవు నింపబడుదువని వాక్యము చెప్పుతుంది.

దేనిని గూర్చియు చింతపడకుడిగాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనలచేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమును మీ తలంపులకును కావలి యుండును. (ఫిలిప్పి 4:6-7).

ఈ దినము దేవుని యొద్ద నుండి ” శాంతి అనె అద్భుతము నీవు పొందాలని దేవుని అడుగుచున్నాను.

“నేను నా శాంతిని నీకు ఇచ్చుచున్నాను . నా శాంతిని మీకిచ్చుచున్నాను.”

Do you want to receive this daily encouragement in your inbox? Sign up for A Miracle Every Day.

* indicates required
    *

Leave a Comment